దీపావళి ఎప్పుడు – 24/25? గ్రహణంతో మారనున్న పండుగ తేదీ….

సాధారణంగా నరక చతుర్దశి అమావాస్య పక్క పక్కన వస్తాయి కదా,చతుర్దశి ముందు రోజున జరుపుకొని మరణాడు దీపావళి జరుపుకోవడం సాధారణ అలవాటు. అయితే ఈసారి చతుర్దశి వచ్చిన 24 వ తారీకు రాత్రి, అమావాస్య ఉంది. అయితే మరునాడు కూడా అమావాస్య కనుక ఉంటే మనం మరునాడే దీపావళి పండుగ చేసుకుంటాం. ఈసారి 25వ తారీకు పాక్షిక సూర్యగ్రహణం ఉండడం వల్ల, తిథి అంతంలో అంటే సూర్యాస్తమయం అయ్యి చంద్రోదయం అయ్యే సరికల్లా, గ్రహణము అయిపోతుంది. తర్వాత తిధి కూడా అయిపోతుంది. ఈ గ్రహణం ఉన్న కాలంలో మనం ఇదే చేసుకోలేము,

అమావాస్య తిధి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి, అమావాస్య తేది పూర్తిగా ఉన్నటువంటి 24వ తారీఖు రాత్రి, దీపావళి పండుగ చేసుకుంటాము. యిదా, ఆదా అన్న కన్ఫ్యూజనే లేదు, 24 వ తారీకు ఉదయం ఇంటిల్లిపాది మంచి ప్రశస్తమైన నువ్వుల నూనెని అభ్యంగనం చేసుకొని, నూనె వంటికి రాసి, తలకు రాసుకొని, చక్కగా తలంటు పోసుకోవడం. ఆరోజు మధ్యాహ్నము లేదా ఉదయకాలంలోనే కొత్తగా కొనుక్కున్నటువంటి ప్రమిదలని పాత ప్రమిదలని, కడిగి ఆరబెట్టుకొని, నూనె లో వత్తులని నానబెట్టుకొని, తర్వాత సాయంకాలం లక్ష్మీ పూజ, తర్వాత మనం దీపాలు పెట్టుకోవడం, దీపావళి పండుగ యధావిధిగా జరపేసుకోవచ్చు.