ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది

By | August 7, 2021

కీళ్ల మధ్యలో జిగురు తయారవ్వాలంటే, అలవాట్లు ఆహార నియమాలు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 60,70 ఏళ్ళ వయసులో రావలసిన కీళ్లనొప్పులు, 20,30 ఏళ్లకే ఇప్పుడు పిల్లలకి వస్తున్నాయి. కారణం ఏమిటంటే, మన జీవన విధానం ప్రతి రోజు ఎంజాయ్ చేయాలనే ఆలోచన కాకుండా, ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. ఇలాంటి మంచి విషయాలు మనకు సంబంధం లేదు లే అని తప్పించుకోకుండా, వినడానికి ప్రయత్నం చేయండి.కీళ్ల మధ్య లో జిగురు, బెండకాయలు తింటే వస్తుందని, కొంతమంది బెండకాయలు ఎక్కువగా తింటూ ఉంటారు.

అంటే బెండకాయలు జిగురు ఉంది కాబట్టి,ఈ జిగురు వెళ్లి కీళ్ల సంధులలో కూర్చుంటుంద,ఎక్కడైనా పొట్ట లో యాసిడ్ తగిలేసరికి సుబ్బరంగా ఎగిరిపోతుంది, అట్లా జిగురు రక్తంలో ఉంటుంది అనుకోండి రక్తం జిగురుగా రావాలి కదా, ముందు కీళ్ళకు వెళ్లాలంటే ఆ జిగురు బ్లడ్ లో వెళ్లాలి కదా,బ్లడ్ లో నుంచి వెళితేనే కదా,కిలు లోకి చేరేది మరి మీ బ్లడ్ తీస్తే ఏమైనా జిగురుగా బెండకాయలు తిన్నాక వస్తుందా.ఎక్కడైనా కొంతమంది నూనె బాగా తాగితే, ఆ నూనె జిగురు వెళ్లి కీళ్ల సందులో పేరుకొని అక్కడ జిగురు ఏర్పడుతుందని అనుకుంటారు. మరి అలా అనుకుంటే ఎన్ని కోట్ల జీవరాశులు అన్నింటికీ కూడా కీలు ఉన్నాయి కదా,మరి ఎక్కడైనా బెండకాయ తింటాయా అవన్నీ నూనె తాగుతాయా,మరి వాటికి జిగురు ఎక్కడి నుండి వస్తుంది.

తాబేలు 400 ఏళ్ళు కీళ్ళు పట్టెయ్యవే ఏనుగుగు 100 ఏళ్ళు కీళ్ళు పనిచేస్తాయి అంత బరువు ఉన్న ఏనుగు కింద పడుకొని లేస్తుంది కానీ ఇప్పుడు మనలో చాలా మంది 60 ఏళ్ళు దాటితే చాలు కింద కూర్చో లేరు అలాగే పైకి లేవలేరు .ఇప్పుడు మరి వాటికీ ఆ జిగురు ఎలా వస్తుంది.కీళ్ల సంధులలో జిగురు రావాలి అంటే,అక్కడ జిగురు రావలసిన మెకానిజం దాన్ని మనం పాడు చేయకూడదు. ఆ జిగురు ఉత్పత్తిని పాడు చేసే పని మనం ఏమి చేస్తున్నాము అంటే,ఉప్పు తింటున్నాము ఉప్పు కీళ్ల సంధులలో దెబ్బతినే ఇదే నెంబర్ వన్ రీసన్.దీనికి మీరు మార్పు చేయకుండా,ఏం చేసినా జిగురు ఉత్పత్తి కాదు కానీ,ఉప్పు అనేసరికి ఎవరి మాట వినరు.