Category Archives: Latest

ఇలా జరుగుతుందని ముందే తెలుసా…

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో, పారా కమాండో సాయి తేజ దుర్మరణం పాలు అవ్వడం తెలుగు వారందరినీ కలచివేస్తోంది. సాయి తేజ సొంతూరు చిత్తూరు జిల్లా రేగడంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయి తేజ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అంతా సాయి తేజ తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. 2012లో ఆర్మీ జవానుగా ఎంపికయిన సాయి తేజ, మొదటగా బెంగుళూరుకు రెజిమెంట్ లో, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పనిచేశారు. (9015)