అశ్వినీ దేవతలు తిరిగే ఈ 24 నిమిషాల్లో ఈ చిన్న మంత్రం చదివి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిత్యజీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి, సమస్యలు పోవాలని ఎప్పుడూ అనుకోవాలి. ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం తధాస్తు దేవతలు ఎవరు, వారు ఏ సమయంలో తిరుగుతారు.
అశ్వినీ దేవతలే తధాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు తదా అంటే అప్రకారంగా అస్తూ అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదేపదే అంటే తధాస్తు దేవతలు వెంటనే తధాస్తు అంటారు. ఇలా తధాస్తు అనే వారిని తధాస్తు దేవతలు అని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి, కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి, సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు.
ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్వినీ కుమారులు, వీరిని తధాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు. అశ్వినీ దేవతలు ఎప్పుడు ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు.వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో, తధాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు.
అశ్వినీ దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో, అక్కడికి వచ్చి యజ్ఞ యాగాదులు సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ, ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు. దానివల్ల యజ్ఞ యాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తధాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట, అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంధాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. వారు ఎక్కువగా సంధ్యా సమయాల్లో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.