ఏప్రిల్ 9 ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఇలా పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా కష్టాలు లేకుండా ఉంటాయి..

2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిందని మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముడి దివ్య ఆశీస్సులుగా భావించి, అందరూ జాగ్రత్తగా భద్రపరచుకున్నారు. ఇటువంటి శక్తివంతమైన అక్షంతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు.

కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేస్తే, రాములవారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి, జాతకంలో అదృష్టం కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు. 20204 ఏప్రిల్ 9వ తేదీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం అంటేనే హనుమంతుడికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడు కాబట్టి, ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఏప్రిల్ 9వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు కచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత కావాల్సినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాములవారి అక్షింతలకు, అత్యంత శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలంటే, ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఆవు పాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకును తీసుకొని, పసుపు కలిపిన ఆవుపాలని అయోధ్య అక్షింతల మీద చిలకరించండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Proudly powered by WordPress | Theme: Rits Blog by Crimson Themes.