తిపెద్ద సూర్యగ్రహణం. ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం. ఐదున్నర గంటల పాటు ఉంటుంది 380 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహణం ఏర్పడబోతుంది అనే జ్యోతిష్యులు చెబుతున్నారు.ఫాల్గుణ అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.
ఈ ఫాల్గుణ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక, దీనిని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సోమవతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన శాస్త్రాలు చెబుతున్నాయి. అది కాక ఈ రోజే రాహు గ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడిపోతుంది. ఈ గ్రహణం 380 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ గ్రహణం మొత్తం ఐదున్నర గంటల సమయం ఉంటుంది.
భారతదేశ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9:10 నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు.