మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపా దడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు.
అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే , బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, ‘లాస్ వెగాస్’, ‘డెసపరేట్ హౌజ్ వైవ్స్’ లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో నటించింది.